Baby Health Care Tips | Papa Health Care Tips in telugu | child skin care in telugu | Ladies Beauty : Baby Health Care Tips | Papa Health Care Tips in telugu | child skin care in telugu | Ladies Beauty Tips in telugu | Ladies Health Tips in telugu | free beauty tips for men telugu beauty

Tuesday, 25 February 2014

Baby Health Care Tips | Papa Health Care Tips in telugu | child skin care in telugu | Ladies Beauty Tips in telugu | Ladies Health Tips in telugu | free beauty tips for men telugu beauty






బిడ్డ పాలు త్రాగడాన్ని తిరస్కరించటం అనేది ఆందోళన కలిగించే విషయం. మీ బిడ్డ పాలు తాగడాన్ని తిరస్కరించటానికి అనేక కారణాలు ఉన్నాయి. మీ బిడ్డ పాలు ఎందుకు త్రాగటం లేదో కారణాల గురించి తప్పనిసరిగా తెలుసుకోండి. మీ బిడ్డ పాలు త్రాగడాన్ని తిరస్కరించినప్పుడు మీరు తప్పనిసరిగా మీ పీడియాట్రిషిన్ సంప్రదించడం చాలా ముఖ్యం. శిశువు పాలు త్రాగటం లేదని గుర్తించటం అనేది తల్లిదండ్రులకు చాలా సమస్యాత్మక మరియు సవాలుగా ఉంటుంది. పరిస్థితి ఆకస్మికంగా ఉద్భవిస్తే,కొంత సమస్య లేదా మీ పిల్లలకు కొంత అసౌకర్యం కలిగి, అతను పాలు త్రాగడానికి తిరస్కరించి ఉండవచ్చు. కానీ పరిస్థితి పుట్టిన సమయం నుండి ఉన్నట్లయితే, అతను తల్లిపాలను త్రాగటానికి ఒక రకమైన కష్టంను కలిగి ఉన్నాడని అర్థం. అయితే చాలా కొన్నిసార్లు స్పష్టంగా మరియు కొన్ని సార్లు అనుమానాస్పదంగా ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలు పుట్టిన తరువాత తల్లిపాల ప్రక్రియ ప్రారంభించడం అనేది కొంచెం కష్టంగా తెలుసుకుంటారు. సాధారణంగా మొదట కొన్నిసార్లు పిల్లలు నేర్చుకోనే విధానంలో పాలు త్రాగడానికి తిరస్కరిస్తారు. కొన్ని రోజులు విజయవంతంగా నేర్పిన తర్వాత కూడా జరగవచ్చు. మీ పిల్లల తిరస్కరణ వెనుక కారణాలు కనుగొనేందుకు మరియు సమస్యను పరిష్కరించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. శిశువు పాలు త్రాగకపోవటానికి కారణాలు ఇక్కడ మీ బిడ్డ ఎందుకు పాలు త్రాగటం లేదో తెలుసుకోవటానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

                                                       ************


1. పుట్టిన సమయంలో గాయాలు డెలివరీ క్లిష్టముగా ఉన్న సమయంలో లేదా అపరిపక్వ పిల్లల జననంలో గాయాలు కలగవచ్చు. మీరు శిశువు పుట్టిన వెంటనే ఏడుపు ప్రారంభమవాలని గుర్తు ఉంచుకోండి.
 2. బ్రీతింగ్ సమస్య కొన్నిసార్లు శిశువులు పాలు త్రాగుతున్న సమయంలో శ్వాస ఇబ్బంది ఉండవచ్చు. అప్పుడు వారు పీల్చటానికి మరియు మ్రింగటానికి కష్టంగా ఉండి పాలను తిరస్కరించవచ్చు.
 3. నోటిద్వారా అయిష్టం కొంత మంది పిల్లలు నోటి ద్వారా ఏదైనా తీసుకోవటానికి తిరస్కరిస్తారు. ఎందుకంటే వారు నోటి అయిష్టతతో బాధపడుతూ ఉంటారు.
 4. ఇతర ప్రాధాన్యతలు పిల్లలు కొన్ని నిర్దిష్ట మార్గాలను ఇష్టపడతారని గమనించాలి. ఫీడింగ్ రకం మారినప్పుడు పాలు త్రాగటానికి తిరస్కరించవచ్చు. ఇది సాధారణంగా సీసా ఫీడింగ్ ఉన్నప్పుడు జరుగుతుంది. అలాగే పిల్లలకు ఎవరైనా ఫీడింగ్ చేయటానికి ప్రయత్నించినప్పుడు కూడా జరగవచ్చు.
 5. నొప్పి పిల్లలు చెవి ఇన్ఫెక్షన్,నొప్పి లేదా ఇతర అసౌకర్యాలతో బాధపడవచ్చు. పాలు త్రాగటానికి తిరస్కరించినప్పుడు వారి ఏడుపు మనకు వారికీ కలిగిన అసౌకర్యాన్ని తెలియచేయటానికి ఒక సందేశం అని చెప్పవచ్చు.
 6. కడుపు నొప్పి సాదారణంగా పిల్లలు ఎక్కువగా కడుపు నొప్పితో బాధ పడతారు. విషయంలో వారు చాలా ఏడుస్తారు. వారు ప్రశాంతంగా ఉండడం అనేది చాలా క్లిష్టమైంది. ఇది సాదారణంగా అపరిపక్వ జీర్ణశక్తి కారణంగా సంభవించవచ్చు. ఆహారం సెన్సిటివ్ కలిగి ఉండటం లేదా ఇతర కారణాల వలన కూడా జరగవచ్చు

7. అలెర్జీలు మీ బిడ్డ పాలు త్రాగటానికి తిరస్కరించినప్పుడు మీరు ఇతర సమస్యలు ఏమైనా ఉంటే చూడాలి. ముఖ్యంగా పాల అలెర్జీ ఉందో లేదో చూడండి. కొన్నిసార్లు పిల్లలకు పాల అలెర్జీ ఉండటం జరుగుతుంది. అప్పుడు అతను పాలు త్రాగడానికి సాధ్యం కాదు
8. ఇంద్రియ విషయాలు మీ పిల్లలకు కాంతి లేదా ధ్వని లేదా ఏదో ఒక సున్నితమైన విషయం హాయిగా పాలు త్రాగకుండా ఆపే అవకాశం ఉంది.
 9. అనారోగ్యం కొన్నిసార్లు పిల్లల ఆరోగ్యం సరిగ్గా లేకపోతె పాలు త్రాగడానికి తిరస్కరిస్తారు. నిజానికి పిల్లల్లో అనారోగ్యంనకు మొదటి సంకేతం పిల్లలు పాలు త్రాగకపోవటం మరియు పాలు చాలా తక్కువగా త్రాగటం అని చెప్పవచ్చు.
 10. మిల్క్ ఫ్లో పాలు సరఫరా ఎక్కువగా లేదా తక్కువగా ఉండటం అనేది కొన్నిసార్లు తల్లికి తెలియకపోవవచ్చు. అప్పుడు పిల్లలు పాలు త్రాగటానికి తిరస్కరిస్తారు. పిల్లలు పాలు త్రాగనప్పుడు,దాని వెనుక ఉన్న కారణంను కనుగొనడం చాలా ముఖ్యం. సమస్య సకాలంలో పరిష్కారం కాకుంటే,మీరు వెంటనే శిశువైద్యుడుని సంప్రదించాలి. పిల్లలు కొన్ని నెలల వయస్సు వరకు పాలు మీద ఆధారపడి ఉన్నప్పుడు,ఇది మరింత ముఖ్యమైనది అవుతుంది.


No comments:

Post a Comment